Comedian raghu karumanchi biography of christopher
కారుమంచి రఘు
రఘు కారుమంచి | |
---|---|
జననం | రఘు కారుమంచి హైదరాబాదు |
విద్య | ఎంబీయే |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2002 - ప్రస్తుతం |
తల్లిదండ్రులు |
కారుమంచి రఘు ఒక తెలుగు సినీ హాస్యనటుడు.
150 కి పైగా సినిమాల్లో నటించాడు.[2][3][4] ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ హాస్యకార్యక్రమంలో రోలర్ రఘు అనే పేరుతో ఒక బృందాన్ని నడిపాడు.
రఘు 2002 లో వి.వి.
Atila altaunbay biography examplesవినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు.[5]అదుర్స్ సినిమా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.[3]
జీవితం
[మార్చు]రఘు వాళ్ళ స్వస్థలం తెనాలి. అతను హైదరాబాదులో పుట్టి పెరిగాడు. తండ్రి మాజీ సైనికాధికారి. తల్లి గృహిణి.
రఘు ఎంబీఎ (ఇంటర్నేషనల్ మార్కెటింగ్) పూర్తి చేసిన తరువాత కొద్ది రోజులు ఓ సాఫ్టువేరు కంపెనీలో పనిచేశాడు. రఘుకు ఇద్దరు పిల్లలున్నారు.[3] ఎవి కాలేజీలో ఆఫీస్ మేనేజ్‌మెంట్ చదివేటపుడు తెలంగాణా రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి ఈయనకు క్లాస్ మేట్.[6]
కెరీర్
[మార్చు]వి. వి. వినాయక్, సురేందర్ రెడ్డి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పటి నుంచి రఘుకు మంచి స్నేహితులు.
రఘు ఉద్యోగం చేస్తున్నపుడు వీళ్ళు కింది ఇంటిలోనే ఉండేవారు. వాళ్ళిద్దరూ రఘును సినీ పరిశ్రమలోకి ఆహ్వానించారు. రఘు కూడా నటనా రంగం వైపు ఆసక్తితో వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించాడు. రఘుకు జూనియర్ ఎన్టీఆర్తో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. ఈయన కెరీర్లో బాగా గుర్తింపు వచ్చిన సినిమా అదుర్స్. ది అంగ్రేజ్, హైదరాబాద్ నవాబ్స్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి.
అదుర్స్ సినిమా విడుదలయ్యాక ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కొద్ది నెలలు బాగానే గడిచినా స్టాక్ మార్కెట్లో నష్టం రావడంతో తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.[6] తర్వాత మళ్ళీ మరిన్ని సినిమా అవకాశాలు వచ్చాయి. జబర్దస్త్ కార్యక్రమంలో 26 ఎపిసోడ్లు రోలర్ రఘు అనే పేరుతో బృందాన్ని నడిపాడు. మంచి పేరు వచ్చింది. ప్రేక్షకులకు చేరువయ్యాడు.
ఆ తర్వాత ఆ కార్యక్రమానికి దూరమయ్యాడు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో అవకాశం చేజారింది.